RCB: ఐపీఎల్ లో నేడు ఆర్సీబీతో కేకేఆర్ ఢీ... అందరి కళ్లు కోహ్లీపైనే!

RCB takes on KKR
  • కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
  • గత మ్యాచ్ లో బ్యాట్ ఝుళిపించిన కోహ్లీ
  • ఇవాళ కోల్ కతాపైనా కోహ్లీ విజృంభించాలని కోరుకుంటున్న ఫ్యాన్స్
ఐపీఎల్-16లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. కోల్ కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానం ఈ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు జట్టు ఇప్పటికే ఓ మ్యాచ్ గెలిచి టోర్నీలో శుభారంభం చేసింది. అదే సమయంలో కోల్ కతా నైట్ రైడర్స్ ఆడిన ఒక్క మ్యాచ్ లోనూ ఓటమిపాలైంది. 

కాగా, గత మ్యాచ్ లో బౌండరీల వర్షం కురిపించిన మాజీ సారథి విరాట్ కోహ్లీ ఇవాళ మ్యాచ్ లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. ఇటీవల ఫామ్ ను అందిపుచ్చుకున్న కోహ్లీ మైదానంలో ఏ మూలకైనా బంతిని పంపుతూ తన క్లాస్ ను ఘనంగా చాటుతున్నాడు. 

ఏప్రిల్ 2న ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో ఛేజింగ్ చేస్తూ కోహ్లీ రెచ్చిపోయాడు. 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 82 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఇవాళ కోల్ కతాపైనా కోహ్లీ అదే దూకుడు కనబర్చాలని ఆర్సీబీ శిబిరంతో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
RCB
KKR
Toss
Bowling
Virat Kohli
Eden Gardens
Kolkata
IPL-2023

More Telugu News