India: కరోనా కేసులు మళ్లీ పెరగుతుండటానికి XBB1.16 కారణం.. ఈ వేరియంట్ లక్షణాలు ఇవే!

XBB1 variant is the reason for increasing of Corona cases in India

  • ఢిల్లీలో 98 శాతం కేసులు XBB1.16 వేరియంట్ వే
  • పరిస్థితిని గమనిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
  • దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి

మన దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న కేసుల సంఖ్య 5 వేలను దాటిపోయింది. గత ఏడాది సెప్టెంబర్ నెల తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల కావడం గమనార్హం. అయితే ప్రస్తుతం కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణం XBB1.16 వేరియంట్ కారణం అని చెపుతున్నారు. ఢిల్లీలో నమోదవుతున్న కేసుల్లో 98 శాతం ఈ వేరియంట్ కేసులే ఉండటం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వేరియంట్ ను నిశితంగా గమనిస్తోంది. కేంద్రం కూడా దీనిపై అప్రమత్తంగా ఉంది. 

XBB1.16 వేరియంట్ లక్షణాలు: 
తొలుత జ్వరం వస్తుంది. ఒకటి, రెండు రోజులు జ్వరం ఉంటుంది. దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటాయి. ఒంటి నొప్పులు, గొంతు నొప్పి, తలనొప్పి, పొత్తి కడుపులో అసౌకర్యం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే ఈ వేరియంట్ తీవ్రమైన సమస్యలను కలిగించదు. కానీ దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు. శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు, వయసు పైబడిన వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

  • Loading...

More Telugu News