Swamy Srinivasananda Saraswathi: హిందూ మతాన్ని గౌరవించడం జగన్ కు, ఆయన కుటుంబానికి ఇష్టం ఉండదు: స్వామి శ్రీనివాసానంద సరస్వతి
- కాలు బెణికిందని ఒంటి మిట్టకు వెళ్లకుండా జగన్ ఆగిపోయారన్న స్వామి
- తర్వాతి రోజే పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారని విమర్శ
- బ్రహ్మోత్సవాలకు భార్యతో కలిసి ఒక్కసారైనా వెళ్లారా అని ప్రశ్న
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందూ మతాన్ని, హిందూ మత సంప్రదాయాలను గౌరవించడం క్రైస్తవ భావాలు కలిగిన జగన్ కు ఆయన కుటుంబ సభ్యులకు ఇష్టం ఉండదని అన్నారు. హిందూ దేవాలయాలకు వెళ్లడాన్ని ఇష్టపడరని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించాల్సి ఉన్నప్పటికీ కాలు బెణికిందనే సాకుతో జగన్ ఆగిపోయారని... ఆయనకు హిందూ మతంపై గౌరవం లేదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. ఆ తర్వాతి రోజే చిలకలూరిపేటలో జరిగిన కార్యక్రమానికి ఎలా హాజరయ్యారని అడిగారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు కానీ, సీతారాముల కల్యాణానికి కానీ భార్య భారతితో కలిసి ఒక్కసారైనా వెళ్లారా అని మండిపడ్డారు.