President Of India: యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి ముర్ము

President Murmu takes maiden sortie in fighter plane flies in Sukhoi 30 at Tezpur air base

  • శనివారం ఉదయం సుఖోయ్ 30 ఎంకేఐలో ప్రయాణం
  • ఈ ఘనత సాధించిన రెండో మహిళా రాష్ట్రపతిగా రికార్డు
  • 2009లో ఫైటర్ జెట్ లో ప్రయాణించిన ప్రతిభా పాటిల్

భారత రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించారు. అస్సాం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె శనివారం ఉదయం తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో యుద్ధ విమానంలో విహరించారు. సుఖోయ్ లో విహ‌రించిన రెండవ మ‌హిళా రాష్ట్ర‌ప‌తిగా ముర్ము నిలిచారు. 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తొలిసారి ఈ విమానంలో ప్రయాణించారు. కాగా, తేజ్‌పూర్ విమానాశ్ర‌యం త‌వాంగ్ సెక్టార్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. ఇక, సుఖోయ్ 30 ఎంకేఐ  రెండు సీట్లతో కూడిన  ఫైట‌ర్ జెట్‌ విమానం. దీన్ని ర‌ష్యాకు చెందిన సుఖోయ్ సంస్థ అభివృద్ధి చేయగా.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ  జెట్‌ను నిర్మించింది.

  • Loading...

More Telugu News