Narendra Modi: తెలంగాణ అభివృద్ధిపై మాకే నీతులు చెపుతారా?: మోదీపై తలసాని విమర్శలు

Talasani fires on Modi

  • రాజకీయ అజెండాతోనే మోదీ పర్యటన కొనసాగిందన్న తలసాని 
  • తమ ప్రభుత్వంపై ప్రధాని తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శ 
  • అదానీపై జేపీసీ వేయడానికి భయం ఎందుకని ప్రశ్న

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. సికింద్రాబాద్ - హైదరాబాద్ వందేభారత్ రైలును ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. మోదీ పర్యటన ముగిసిన తర్వాత మీడియాతో తలసాని మాట్లాడుతూ ప్రధానిపై విమర్శలు గుప్పించారు.

 కేవలం రాజకీయ అజెండాతోనే మోదీ హైదరాబాద్ పర్యటన కొనసాగిందని అన్నారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో తెలంగాణ ప్రభుత్వంపై మోదీ తప్పుడు విమర్శలు చేశారని మండిపడ్డారు. అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడటం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నుంచే ఎక్కువ నిధులు వెళ్తున్నాయని చెప్పారు. 

వందేభారత్ రైలును మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని తలసాని ప్రశ్నించారు. సింగరేణిని అదానీకి అప్పగించేందుకు మోదీ యత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి బాటలో పయనించకపోతే రాష్ట్రానికి ఇన్ని అవార్డులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తమకు కావాల్సింది అవార్డులు కాదని, నిధులని అన్నారు. తెలంగాణ అభివృద్ధిపై తమకే నీతులు చెపుతారా అని ప్రశ్నించారు. అదానీపై జేపీసీ వేయడానికి మోదీ ఎందుకు భయపడుతున్నారని అడిగారు.

  • Loading...

More Telugu News