Revanth Reddy: మనవడు పుట్టడంతో రేవంత్ రెడ్డి ఆనందం

Revanth Reddy feels happy with grandson arrival
  • మగబిడ్డకు జన్మనిచ్చిన రేవంత్ కుమార్తె
  • సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన రేవంత్
  • తల్లీబిడ్డకు మీ ఆశీస్సులు కావాలంటూ ట్వీట్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాత అయ్యారు. ఆయనకు మనవడు పుట్టాడు. రేవంత్ రెడ్డి చిన్న కుమార్తె నైమిష పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రేవంత్ సోషల్ మీడియాలో వెల్లడించారు. తన ఇంట మనవడు జన్మించాడన్న విషయం చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు. 

"నా చిన్న కూతురు నైమిష గతవారం మగబిడ్డను ప్రసవించింది. బిడ్డకు, తల్లికి మీ అందరి దీవెనలు కావాలి" అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అంతేకాదు, మనవడి ఫొటోను కూడా పంచుకున్నారు.
Revanth Reddy
Grandson
Nymisha
Daughter
Congress
Telangana

More Telugu News