Assam CM: అదానీతో లింక్ పెడుతూ రాహుల్ ట్వీట్.. పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించిన అసోం ముఖ్యమంత్రి

I will file defamation suit on Rahul Gandhi says Assam CM Himanta
  • అదానీ గ్రూప్ కు, హిమంత బిశ్వ శర్మకు లింక్ పెడుతూ రాహుల్ ట్వీట్
  • ఇది ముమ్మాటికీ తన పరువుకు భంగం కలిగించేదే అన్న హిమంత
  • మోదీ అసోం పర్యటన ముగిసిన వెంటనే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ తో తనకు లింక్ పెడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ పై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. పరువు నష్టం దావా వేస్తానంటూ రాహుల్ ను హెచ్చరించారు. గువాహటిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... ఏప్రిల్ 14న ప్రధాని మోదీ అసోం పర్యటన ముగిసిన తర్వాత రాహుల్ పై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. 

రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ముమ్మాటికీ తన పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేదే అని అన్నారు. ప్రధాని అసోం నుంచి వెళ్లిన వెంటనే రాహుల్ ట్వీట్ పై చర్యలు తీసుకుంటానని, గువాహటిలో పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. ఈ అంశంపై ప్రస్తుతం తాను ఇంతకంటే ఎక్కువ స్పందించనని, రాజకీయాలు మాట్లాడబోనని.... ఎందుకంటే ఇప్పుడు బిహు పండుగ వేడుకలను నిర్వహించుకోవాలని చెప్పారు.
Assam CM
Himanta Biswa Sarma
BJP
Rahul Gandhi
Congress
Defamation Suit

More Telugu News