flight: విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి.. వెనక్కి వచ్చేసిన లండన్ ఫ్లైట్

Air India London bound flight returns to Delhi after passenger hits cabin crew members
  • ఢిల్లీ నుంచి ఈ ఉదయం బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం
  • ఫ్లైట్ గాల్లో ఉండగా రచ్చ చేసిన ఓ ప్రయాణికుడు 
  • ఢిల్లీలో ల్యాండ్ చేసి ఆ  వ్యక్తిని పోలీసులకు అప్పగించిన సిబ్బంది
ఈ మధ్య కాలంలో విమాన ప్రయాణాల్లో ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ, ఇబ్బంది కలిగిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. అలాంటి వారి కారణంగా తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం.. టేకాఫ్ అయిన కాసేపటికే ఢిల్లీకి రివర్స్ అయింది. 

ఓ ప్రయాణికుడు రచ్చ చేయడమే ఇందుకు కారణమైంది. విమానం గాల్లో ఉండగా సదరు వ్యక్తి విమాన సిబ్బందితో గొడవ పడ్డాడు. ఇద్దరు సిబ్బందిపై దాడి చేశాడు. ఎంత సర్దిచెప్పినా అతను వినకపోవడంతో పైలట్ విమానాన్ని వెనక్కుతిప్పాడు. తిరిగి ఢిల్లీలోని విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. సదరు ప్రయాణికుడిని విమానం నుంచి దింపేసి ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు.
flight
air india
Delhi
cabin crew
passenger hits
London bound flight
ఇఆఒఉఇయ

More Telugu News