Election Commission: ఈసీ సంచలన నిర్ణయం... సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీ పార్టీలకు జాతీయ హోదా రద్దు

Election Commission withdraws national party status for CPI and TMC

  • పలు పార్టీలకు జాతీయ హోదా ఉపసంహరించుకున్న కేంద్ర ఎన్నికల సంఘం
  • అదే సమయలో ఆప్ కు జాతీయ పార్టీ హోదా
  • టీఎంసీ, సీపీఐ, ఎన్సీపీలకు ఈసీ నిర్ణయంతో తీవ్ర నిరాశ

కేంద్ర ఎన్నికల సంఘం నేడు కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలకు జాతీయ పార్టీ హోదా రద్దు చేసింది. అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పించింది. ఈ మేరకు ఈసీ నుంచి ప్రకటన వెలువడింది. 

మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ పార్టీకి, శరద్ పవార్ ఆధ్వర్యంలో నడిచే ఎన్సీపీకి ఈసీ నిర్ణయం తీవ్ర నిరాశ కలిగిస్తుందనడంలో సందేహం లేదు. 

ఇక, ఆప్ విషయానికొస్తే ఢిల్లీలో పురుడుపోసుకున్న ఈ పార్టీ... క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. పంజాబ్ లోనూ అధికార పీఠం చేజిక్కించుకున్న ఆప్... మరికొన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. 

ముఖ్యంగా, గతేడాది జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 5 స్థానాల్లో విజయం సాధించి ఉనికిని చాటుకుంది. గుజరాత్ బరిలో దిగిన తొలిసారే ఈ స్థాయిలో స్థానాలు కైవసం చేసుకోవడం మామూలు విషయం కాదు.

  • Loading...

More Telugu News