RCB: కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్ వెల్... ఒకర్ని మించి ఒకరు చితకబాదారు!

RCB trio smashes LSG bowling

  • రాయల్ చాలెంజర్స్ బెంగళూరు × లక్నో సూపర్ జెయింట్స్
  • చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్
  • మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు
  • 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు
  • అర్ధసెంచరీలతో అలరించిన కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్ వెల్

లక్నో సూపర్ జెయింట్స్ తో పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాప్-3 బ్యాట్స్ మన్ పరుగుల సునామీ సృష్టించారు. మొదట విరాట్ కోహ్లీ మెరుపుదాడి చేస్తే... ఆ తర్వాత డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ జోడీ విధ్వంసక బ్యాటింగ్ తో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంను హోరెత్తించింది. ఒకర్ని మించి ఒకరు సిక్సర్ల మోత మోగించడంతో పాపం... లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దానికి తోడు ఫీల్డర్లు క్యాచ్ లు వదలడం సూపర్ జెయింట్స్ కు ప్రతికూలంగా మారింది. 

దాంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ గా వచ్చిన కోహ్లీ 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగ్ లో అవుటయ్యాడు. 

కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ అవుట్ కావడంతో బరిలో దిగిన మ్యాక్స్ వెల్ వచ్చీ రావడంతోనే చితకబాదుడు మొదలుపెట్టాడు. మ్యాక్స్ వెల్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 59 పరుగులు చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మార్క్ వుడ్ 1, అమిత్ మిశ్రా 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News