CPI Narayana: సీపీఐకి జాతీయ పార్టీ హోదాను తొలగించడంపై నారాయణ స్పందన

Narayana response on removal of national party status for CPI
  • జాతీయ హోదా రద్దు చేయడం విచారకరమన్న నారాయణ
  • స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర సీపీఐదని వ్యాఖ్య
  • రాబోయే రోజుల్లో కూడా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటామన్న నారాయణ
సీపీఐ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ హోదాను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందిస్తూ.. ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడం విచారకరమని చెప్పారు. సీపీఐకి వందేళ్ల చరిత్ర ఉందని, స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పాల్గొన్నదని అన్నారు. ఎన్నో జాతీయ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిందని చెప్పారు. జాతీయ పార్టీ హోదాను రద్దు చేస్తూ ఈసీ తీనుకున్న నిర్ణయం తమను నిరుత్సాహపరచలేదని అన్నారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో కూడా ప్రజా ఉద్యమాల్లో సీపీఐ పాల్గొంటుందని చెప్పారు.
CPI Narayana
National Status

More Telugu News