Corona Virus: భారత్‌లో స్వల్పంగా తగ్గిన రోజువారీ కరోనా కేసులు

India records a slight decrease in daily corona cases
  • గత 24 గంటల్లో కొత్తగా 5,676 కరోనా కేసులు
  • సోమవారం నాటి లెక్కలతో పోలిస్తే కేసుల్లో స్వల్పంగా తగ్గుదల
  • కరోనా బారిన పడి 21 మంది మృతి
  • ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 37,093
గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 5676 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 21 మంది కరోనాకాటుకు బలయ్యారు. అయితే.. సోమవారం నాటి కేసులతో (5880) పోలిస్తే నేడు రోజువారీ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 37,093. ఇప్పటివరకూ దేశంలో మొత్తం 44,200,079 మంది కరోనా కోరల నుంచి బయటపడగా రికవరీ రేటు 98.73 శాతంగా నమోదైంది. ఇక దేశంలో కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ 220.66 కరోనా టీకా డోసుల పంపిణీ జరిగినట్టు పేర్కొంది.
Corona Virus

More Telugu News