Raviteja: సేఫ్ జోన్ కి దూరంగా 'రావణాసుర' .. 4 రోజుల వసూళ్లు ఇవే!
- ఈ నెల 7వ తేదీన విడుదలైన 'రావణాసుర'
- తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో 14.80 కోట్ల గ్రాస్
- ప్రపంచవ్యాప్తంగా 18.90 కోట్ల గ్రాస్ వసూలు
- బ్రేక్ ఈవెన్ కి వెళ్లడం కష్టమంటున్న విశ్లేషకులు
రవితేజ కథానాయకుడిగా దర్శకుడు సుధీర్ వర్మ 'రావణాసుర' సినిమాను రూపొందించాడు. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి, రవితేజ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఐదుగురు హీరోయిన్లు నటించిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య ఈ నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రవితేజ తన మార్క్ కి భిన్నమైన కథను ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చాడనే టాక్ వినిపించింది. నెగెటివ్ షేడ్స్ కలిసిన ఈ పాత్రలో రవితేజ బాగానే చేసినప్పటికీ, ఆడియన్స్ ఆయనను అలా చూడాలనుకోకపోవడం వలన, రిజల్ట్ పరంగా దెబ్బకొట్టేసింది. అభిమానులంతా కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో ఈ సినిమా 14.80 కోట్ల గ్రాస్ .. 8.82 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 18. 90 కోట్ల గ్రాస్ .. 10.54 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధించాలంటే ఇంకా 13 కోట్లను రాబట్టవలసి ఉంటుంది. ఈ ఫీట్ ను సాధించడం కష్టమేననేది విశ్లేషకుల మాట.