Ramayan: పబ్ లో డీజే స్క్రీన్ పై రామాయణం... యజమానిపై కేసు నమోదు

Police file case after DJ played Ramayan on DJ screen
  • నోయిడాలో ఓ పబ్ విపరీత చర్య
  • డీజే స్క్రీన్ పై రామాయణం వస్తుండగా స్పీకర్లలోంచి ఫాస్ట్ బీట్
  • పబ్ కు వచ్చిన వారు ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన వైనం
  • సుమోటోగా తీసుకున్న పోలీసులు
ఆధునిక జీవనశైలికి వేదికలైన పబ్ లలో ఎలాంటి వాతావరణం ఉంటుందో, ఏ విధమైన దృశ్యాలు కనిపిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే నోయిడాలోని ఓ పబ్ లో డీజే స్క్రీన్ పై రామాయణం ప్రత్యక్షమైంది. 

అది కూడా 1987లో దూరదర్శన్ చానల్లో సూపర్ హిట్టయిన రామానంద సాగర్ తీసిన రామాయణం సీరియల్ దృశ్యాలు పబ్ లో భారీ స్క్రీన్ పై ప్రసారమవుతుండగా, స్పీకర్లలోంచి ఫాస్ట్ బీట్ వినిపించింది. దాంతో పబ్ లోని వారు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. 

ఆ పబ్ పేరు లార్డ్ ఆఫ్ ద డ్రింక్స్. నోయిడాలోని గార్డెన్స్ గలేరియా ప్రాంతంలో ఉంది. డీజే స్క్రీన్ పై రామాయణం ప్రసారమైన నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని పోలీసులు సుమోటోగా తీసుకుని పబ్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆధారంగా తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. పబ్ యజమాని పూజా చౌదరి, ఆమె భర్త మానక్ ను ప్రశ్నించామని తెలిపారు.
Ramayan
DJ Screen
Pub
Case
Police
Noida

More Telugu News