Samyuktha Menon: ‘ప్లాటినమ్ లెగ్’ అంటూ సంయుక్తను ఆటపట్టించిన బ్రహ్మాజీ.. ట్విట్టర్ లో సరదా సంభాషణ!

brahmaji replys to samyuktha menon question on twitter
  • విరూపాక్ష ట్రైలర్ నచ్చిందా? అంటూ సంయుక్తా మీనన్ ట్వీట్ 
  • కామెంట్ల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
  • ఏప్రిల్ 21న విడుదల కానున్న మూవీ
సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ ‘విరూపాక్ష’. సంయుక్తా మీనన్ కథానాయిక. సినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ ఎలా ఉందంటూ హీరోయిన్ సంయుక్తా మీనన్ ట్విట్టర్ వేదికగా కోరింది.

దీనికి నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తోంది. ట్రైలర్ చాలా బాగుందంటూనే.. ‘‘ట్రైలర్ కంటే మీరు చాలా బాగున్నారు.. ట్రైలర్ అంతా మీరే ఉంటే ఇంకా బాగుండేది’’ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఈ కామెంట్ల బాక్స్ లోకి అనుకోని అతిథి కూడా జతయ్యారు. 

సంయుక్త ట్వీట్ కు సీనియర్ నటుడు బ్రహ్మాజీ రిప్లయ్ ఇచ్చారు. ‘‘చాలా బాగుంది ప్లాటినమ్ లెగ్ గారు’’ అంటూ ఆటపట్టించారు. వెంటనే స్పందించిన సంయుక్త.. ‘అర్రే.. ఏంటి బ్రహ్మీ గారు’ అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ సరదా సంభాషణ వైరల్ అవుతోంది. మరోవైపు బ్రహ్మాజీకి మాత్రమే రిప్లయ్ ఇస్తారా? మాకు ఇవ్వరా? అంటూ సంయుక్తా మీనన్‌ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఈ మధ్య సంయుక్తా మీనన్ చేస్తున్న చిత్రాలన్నీ మంచి విజయాలు సాధిస్తున్నాయి. ‘భీమ్లా నాయక్’, ‘బింబిసార’, ‘సార్’ హిట్ అయ్యాయి. అలాగే ‘విరూపాక్ష’ సినిమాపై కూడా పాజిటివ్ బజ్ ఏర్పడింది. సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుంటే హీరోయిన్లను ఐరన్ లెగ్‌ తో పోల్చుతుంటారు.. హిట్ అయితే గోల్డెన్ లెగ్ అంటారు. వరుసగా హిట్లు వస్తున్నాయి కాబట్టి.. ప్లాటినమ్ లెగ్ అనే అర్థం వచ్చేలా బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. 

విరూపాక్ష సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ఈ మూవీ విడుదల కాబోతోంది. మంగ‌ళవారం ఈ చిత్రం ట్రైల‌ర్‌ను స్టార్ ప్రొడ్యూస‌ర్స్ అల్లు అర‌వింద్‌, దిల్ రాజు చేతుల మీదుగా విడుదల చేశారు.
Samyuktha Menon
Brahmaji
Virupaksha
Sai Dharam Tej
Karthik Dandu

More Telugu News