Ukraine: యుద్ధం కారణంగా ఇండియాకు తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఉక్రెయిన్

Ukraine good news to MBBS students returned to India

  • రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా ఇండియాకు తిరిగొచ్చిన వేలాది మంది వైద్య విద్యార్థులు
  • తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న విద్యార్థులు
  • ఇండియా నుంచే పరీక్షలను రాసేందుకు అనుమతిస్తామన్న ఉక్రెయిన్

రష్యా చేస్తున్న యుద్ధంతో ఉక్రెయిన్ దేశం అతలాకుతలం అయింది. ఉక్రెయిన్ లో నివసిస్తున్న ఎంతోమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశ సరిహద్దులు దాటారు. మరోవైపు వైద్య విద్యను అభ్యసించడానికి మన దేశం నుంచి దాదాపు 19 వేల మంది విద్యార్థులు ఆ దేశానికి వెళ్లారు. హాయిగా చదువుకుంటున్న ఈ వైద్య విద్యార్థుల జీవితాలను రష్యా యుద్ధం షేక్ చేసింది. ఇండియాకు తిరిగొచ్చిన ఈ వైద్య విద్యార్థులంతా ఇక్కడే ఉంటున్నారు. తిరిగి ఉక్రెయిన్ కు వెళ్లే పరిస్థితి లేక, పరీక్షలు రాయలేక, తమ భవిష్యత్తు ఏమిటనే ఆందోళనతో గడుపుతున్నారు. 

తాజాగా వీరికి ఉక్రెయిన్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. స్వదేశానికి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులను ఇండియా నుంచే కీలక పరీక్షలకు అనుమతిస్తామని తెలిపింది. ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ ఈ మేరకు ప్రకటించారు. అంతేకాదు, ఇక్కడి నుంచే ఆన్ లైన్ ద్వారా క్లాసులకు హాజరయ్యేందుకు అనుమతిస్తామని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News