JD Lakshminarayana: కేసీఆర్ వల్లే స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఆలోచనలో పడింది: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

CBI former JD Lakshminrayana thanked CM KCR in Steel Plant issue

  • విశాఖ స్టీల్ ప్లాంట్ పై వెనక్కి తగ్గిన కేంద్రం
  • ఆర్ఎన్ఐఎల్ ను బలోపేతం చేస్తామన్న కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్
  • కేసీఆర్ కు ధన్యవాదాలు అంటూ వీవీ లక్ష్మీనారాయణ స్పందన
  • తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొనాలని ఆకాంక్ష 

విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రస్తుతానికి ముందుకెళ్లడంలేదని, అంతకంటే ముందు ఆర్ఎన్ఐఎల్ ను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామని కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటించడం తెలిసిందే. పూర్తిస్థాయి సామర్థ్యంలో స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలు సాగిస్తుందని, స్టీల్ ప్లాంట్ అభివృద్ధిపై ఆర్ఎన్ఐఎల్ యాజమాన్యంతోనూ, కార్మిక సంఘాలతోనూ చర్చిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. అయితే, స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో  తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఒక ఎత్తుగడ అని ఆరోపించారు. 

ఈ అంశంపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాట్ స్టీల్ ప్లాంట్ ఈవోఐ (బిడ్డింగ్)లో పాల్గొనేందుకు చర్యలు తీసుకున్నందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. 

కేసీఆర్ వల్లే కేంద్రం ఆలోచనలో పడిందని, తెలంగాణ బృందం రావడం వల్లే ప్రస్తుతానికి ప్రైవేటీకరణకు వెళ్లకూడదని, ఆర్ఎన్ఐఎల్ ను బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి కారణమైందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనాలని ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News