Simon Doull: పాకిస్థాన్ లో బతకడం, జైల్లో ఉండటం రెండూ ఒకటే: కివీస్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్

Living in jail is much better than living in Pakistan says Simon Doull

  • పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ పై డౌల్ విమర్శలు
  • డౌల్ బస చేసిన హోటల్ ఎదుట బాబర్ అభిమానులు
  • భయంతో తినడానికి కూడా బయటకు వెళ్లేవాడిని కాదన్న డౌల్

న్యూజిలాండ్ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ పై పాకిస్థానీలు గుర్రుగా ఉన్నారు. పాకిస్థాన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. వివరాల్లోకి వెళ్తే... పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆయన కామెంట్రీ చెపుతూ పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పై విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో బాబర్ ఆజమ్ పెషావర్ జల్మీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. క్వెట్టా గ్లాడియేటర్స్ తో జరిగిన మ్యాచ్ లో బాబర్ 65 బంతుల్లో 115 పరుగులు చేశాడు. అయితే 83 నుంచి 100 పరుగులకు చేరుకోవడానికి 14 బంతులు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో క్వెట్టా గెలుపొందింది. ఈ సందర్భంగా ఆజమ్ పై డౌల్ విమర్శలు గుప్పించాడు. 

దీంతో, డౌల్ కు బాబర్ అభిమానుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఆయన బస చేసిన హోటల్ బయట పెద్ద సంఖ్యలో బాబర్ అభిమానులు ఉండేవారు. దీంతో, తాను భయంతో కనీసం తినేందుకు కూడా బయటకు వెళ్లేవాడిని కాదని డౌల్ చెప్పాడు. కొన్ని రోజులు తిండి లేకుండా బాధ పడ్డానని తెలిపాడు. ఎంతో మానసిక హింసకు గురయ్యానని చెప్పాడు. పాకిస్థాన్ లో జీవించడం కంటే జైల్లో ఉండటమే బెటర్ అని అన్నాడు. గతంలో జరిగిన ఈ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు.

  • Loading...

More Telugu News