DL Ravindra Reddy: వైఎస్ విజయమ్మ, షర్మిల జాగ్రత్తగా ఉండాలి.. ప్రశాంత్ కిశోర్ సలహా మేరకు మరో ఇద్దరిని హత్యచేయవచ్చు: డీఎల్

YS Vijayamma and Sharmila should be very careful says DL Ravindra Reddy
  • విజయమ్మ, షర్మిల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న డీఎల్
  • సానుభూతి కోసం వివేకా హత్య, కోడికత్తి దాడి చేయించారని ఆరోపణ
  • కోడికత్తి దాడి వెనుక కుట్ర కోణం లేదని ఎన్ఐఏ చెప్పిందని వ్యాఖ్య
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు. వీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రశాంత్ కిశోర్ సలహా మేరకు మరో ఇద్దరి హత్య జరిగే అవకాశం ఉందని చెప్పారు. గత ఎన్నికల సమయంలో ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకే వివేకా హత్య, వైజాగ్ లో కోడికత్తితో దాడి డ్రామా వంటివి జరిగాయని ఆరోపించారు. జగన్ పై కోడికత్తితో దాడి వెనుక కుట్రకోణం లేదని కోర్టుకు ఎన్ఐఏ తెలిపిందని చెప్పారు.

తాడేపల్లి నుంచి వైఎస్ భారతి రాజ్యాంగం నడుస్తోందని డీఎల్ దుయ్యబట్టారు. వివేకా హత్య కేసులో ఎంత మంది అధికారులను మార్చినా ఒరిగేది లేదని... నిందితులకు కచ్చితంగా శిక్ష పడుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నుంచి తాను ఇండిపెండెంట్ గా పోటీ చేయనని డీఎల్ చెప్పారు. గత ఎన్నికల్లో సుధాకర్ యాదవ్ కు తాను మద్దతిస్తే, తమ వర్గాన్ని తొక్కేశారని మండిపడ్డారు.
DL Ravindra Reddy
YS Vijayamma
YS Sharmila
Murder
Prashant Kishor

More Telugu News