Nayanthara: నయనతారతో నా ప్రేమ ఎలా మొదలయిందంటే..: విఘ్నేశ్ శివన్

Vignesh Sivan reveals how his love started with Nayanatara
  • 'నేనూ రౌడీనే' సినిమా సమయంలోనే తన ప్రేమ మొదలయిందన్న విఘ్నేశ్
  • ఆమెను కలిసినప్పుడే ప్రేమలో పడిపోయానని వెల్లడి
  • తాము చెప్పేంత వరకు తమ ప్రేమ గురించి ఎవరికీ తెలియదన్న విఘ్నేశ్
ప్రముఖ సినీ నటి నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ లు ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ జంట సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చింది. మరోవైపు నయన్ తో తన ప్రేమ ఎలా మొదలయిందో విఘ్నేశ్ వెల్లడించాడు. కెరీర్ పరంగా తాను ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలోనే తన ప్రేమ కథ మొదలయిందని చెప్పాడు. 

తాను సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో 'నేనూ రౌడీనే' కథ రాశానని... తన వద్ద కథ ఉందని తెలుసుకున్న హీరో ధనుశ్ దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడని చెప్పాడు. నయనతారను కలిసి కథ గురించి చెప్పమన్నాడని, నయన్ ఈ కథను అంగీకరించదని తొలుత తాను భావించానని... అయినా, ధనుష్ మాటను కాదనలేక నయన్ ను కలిశానని తెలిపాడు.

ఆమె తనను ఎంతో గౌరవించిందని, ఆ క్షణమే ఆమెతో ప్రేమలో పడిపోయానని చెప్పాడు. ఆ సినిమా రెండో షెడ్యూల్ నుంచే తాము డేటింగ్ ప్రారంభించామని, తాము ప్రేమలో ఉన్నామనే విషయం తాము చెప్పేంత వరకు ఎవరికీ తెలియదని వెల్లడించారు. సెట్ లో మాత్రం నయన్ ను తాను మేడమ్ అనే పిలిచేవాడినని, ఆమె కారవ్యాన్ లోకి కూడా వెళ్లే వాడిని కాదని... వృత్తి పట్ల ఎంతో కమిట్ మెంట్ తో ఉండేవాళ్లమని చెప్పాడు.
Nayanthara
Vignesh Sivan
Love
Tollywood
Kollywood

More Telugu News