Arjun Tendulkar: తొలి మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లో అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్న అర్జున్ టెండూల్కర్

Arjun Tendulkar Sets Unique IPL Record With Father Sachin

  • రెండేళ్ల తర్వాత ఐపీఎల్‌లో అర్జున్ అరంగేట్రం
  • ఒకే ఫ్రాంచైజీకి ఆడిన తండ్రీ కొడుకులుగా సచిన్, అర్జున్ రికార్డ్
  • ఐపీఎల్ చరిత్రలోనే ఇది తొలిసారి
  • రెండు ఓవర్లు వేసిన అర్జున్

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు నిన్న ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన చేసిన అర్జున్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ కూడా ఐపీఎల్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. దీంతో ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన తండ్రీ కొడుకులుగా వీరు రికార్డులకెక్కారు. తొలుత తండ్రి, ఆ తర్వాత కుమారుడు.. ఒకే ఫ్రాంచైజీకి ఆడడం ఐపీఎల్ చరిత్రలోనే ఇది తొలిసారి.

ఆల్‌రౌండర్ అయిన అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ 2021 వేలంలో కనీస ధర అయిన రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, ఐపీఎల్ అరంగేట్రం కోసం అర్జున్ రెండేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. నిన్న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను బౌల్ చేసిన అర్జున్ ఆ తర్వాత మరో ఓవర్ వేశాడు. మొత్తంగా 17 పరుగులు ఇచ్చాడు. అయితే, బ్యాటింగులో మాత్రం అవకాశం రాలేదు. కాగా, ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ముంబై ఐపీఎల్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది.

  • Loading...

More Telugu News