Allu Arjun: ‘దసరా’ టీమ్ ను మెచ్చుకున్న అల్లు అర్జున్

Allu Arjun lauds Nanis Dasara calls it brilliantly made film
  • తన సోదరుడు నాని పనితీరు ఎంతో బావుందన్న అల్లు అర్జున్
  • కీర్తి సురేష్ స్వచ్ఛంగా నటించిందని ప్రశంస
  • మొదటి సినిమాతోనే డైరెక్టర్ శ్రీకాంత్ అదరగొట్టారంటూ ట్వీట్
నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘దసరా’ సినిమా మార్చి 30న విడుదల కాగా, అభిమానుల నుంచే కాకుండా, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. దీంతో అల్లు అర్జున్ సైతం ఈ సినిమాను మెచ్చుకుంటూ, ట్విట్టర్ ద్వారా తన అభినందనలు తెలియజేశారు. 

‘‘దసరా టీమ్ మొత్తానికి పెద్ద అభినందనలు. నా సోదరుడు నాని పనితీరు ఎంతో బాగుంది. కీర్తి సురేష్ స్వచ్ఛమైన నటన చూపించింది. పాటలు అద్భుతంగా ఉన్నాయి. సంగీత దర్శకుడు సంతోష్ గారు మంచి స్కోరు సంపాదించారు. సత్య గారు అద్భుతమైన కెమెరా పనితీరు చూపించారు. అరంగేట్రంతోనే ఈ సినిమా డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ కారు అదరగొట్టేశారు. నిర్మాతలతోపాటు, సినిమాకు చెందిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. వేసవిలో వచ్చిన అచ్చమైన దసరా’’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
Allu Arjun
lauds
Nani
Keerthy Suresh
dasara
brilliantly made

More Telugu News