Apple Store: దేశంలోనే తొలి అధికారిక యాపిల్ స్టోర్.. ముంబైలో రేపు ప్రారంభం.. ఫొటోలు.. విశేషాలు ఇవిగో!

First Pics Of Apple Mumbai Store

  • ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో సిద్ధమైన యాపిల్ స్టోర్
  • నెట్టింట వైరల్‌ అవుతున్న ఫొటోలు 
  • 20వ తేదీన ఢిల్లీలో మరో స్టోర్ కూడా ప్రారంభం

దేశంలోనే తొలి అధికారిక ‘యాపిల్’ రిటైల్‌ స్టోర్‌ ఓపెనింగ్ కు రెడీ అయింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్‌ డ్రైవ్‌ మాల్‌ లో రేపు ఉదయం రిటైల్ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ముంబై స్టోర్‌కు సంబంధించి కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

స్టోర్‌ మొత్తం చాలా రిచ్‌ గా కనిపిస్తోంది. ముంబైలోని యాపిల్ రిటైల్‌ స్టోర్‌ ను 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. లాస్‌ఎంజెల్స్‌, న్యూయార్క్‌, బీజింగ్‌, మిలాన్‌, సింగ్‌పూర్‌ వంటి నగరాల తర్వాత ముంబైలోనే యాపిల్‌ ఐ-ఫోన్‌ రిటైల్‌ స్టోర్‌ ఏర్పాటు కానుంది.

ముంబై తర్వాత రెండు రోజులకే దేశ రాజధాని ఢిల్లీలో రెండో యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ను సంస్థ లాంచ్ చేయనుంది. ఢిల్లీ సాకెట్‌లోని సెలెక్ట్‌ సిటీవాక్‌ మాల్‌లో ఏప్రిల్‌ 20వ తేదీన ఉదయం 10 గంటలకు యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెక్‌ దిగ్గజం ఇప్పటికే వెల్లడించింది.

  • ముంబైలోని స్టోర్ మొదటి అంతస్తులో ఓ సబ్ సెక్షన్ ను ఏర్పాటు చేశారు. అక్కడ వినియోగదారులకు ఐఫోన్, ఐ మాక్స్, ఇతర ప్రొడక్టుల యాక్సెసరీలు విక్రయిస్తారు.
  • హోమ్ పాడ్, యాపిల్ టీవీల కోసం ప్రత్యేకంగా ఓ సెక్షన్ ఏర్పాటు చేశారు. 
  • సీలింగ్ కు ఏర్పాటు చేసిన హ్యాండిక్రాఫ్ట్ టైల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. త్రిభుజాకారంలో చెక్కతో తయారు చేశారు. ప్రతి టైల్ కు 408 కలప ముక్కలతో రూపొందించారు.
  • 100 శాతం పునరుత్పాదక శక్తితో రన్ అయ్యే స్టోర్ ఇది. ఎలాంటి కార్బన ఉద్గారాలను రిలీజ్ చేయదు.
  • ఇందులో 100 మంది ఉద్యోగులు పని చేస్తారు. 20 భాషలు మాట్లాడుతారు. 
 

  • Loading...

More Telugu News