Apple store: వడా పావ్ భలే రుచిగా ఉంది..మాధురీ దీక్షిత్‌కు యాపిల్ సీఈఓ రిప్లై

Tim cook tastes vada pav for the first time and this is what he has to say
  • మంగళవారం ముంబైలో ప్రారంభం కానున్న యాపిల్ స్టోర్ 
  • దేశంలోని తొలి యాపిల్ స్టోర్‌గా గుర్తింపు
  • ప్రారంభోత్సవానికి స్వయంగా యాపిల్ సీఈఓ హాజరు
  • ఇప్పటికే ముంబై చేరుకున్న కుక్‌కు వడాపావ్ పరిచయం చేసిన మాధురీ దీక్షిత్
  • వడా పావ్ గొప్ప రుచిగా ఉందంటూ టిమ్ కుక్ ట్వీట్
దేశంలోని తొలి యాపిల్ స్టోర్ మంగళవారం ముంబైలో ప్రారంభం కానుంది. ఈ స్టోర్ ప్రారంభోత్సవానికి స్వయంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ హాజరవుతారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న టిమ్‌ కుక్‌కు మాధురీ దీక్షిత్ సోమవారం వడా పావ్‌ రుచిని పరిచయం చేశారు. ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో టిమ్‌కుక్‌తో కలిసి తను వడా పావ్ తింటున్న ఫొటోను మాధురి ట్విట్టర్‌లో షేర్ చేశారు. వడా పావ్‌తో అతిథికి ఆహ్వానం పలకడంకంటే మెరుగైనది ఇంకోటి ఉండదు అంటూ ట్వీట్ చేశారు. బిర్యానీకి హైదరాబాద్ ఎంతో ప్రసిద్ధి చెందిందో వడా పావ్‌కు ముంబై అంత ఫేమస్ అన్న విషయం తెలిసిందే. 

ఇక మాధురి ట్వీట్‌కు టిమ్ కుక్ కూడా తన దైన శైలిలో రిప్లై ఇచ్చారు. వడా పావ్ రుచిని పరిచయం చేసిన మాధురికి నా ధన్యవాదాలు. ఈ వంటకం రుచి చూడటం ఇదే తొలిసారి. అద్భుతంగా ఉంది అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో.. ఈ ట్వీట్ల థ్రెడ్ వైరల్‌గా మారింది. కుక్‌కు  ముంబై లోకల్ ట్రైన్లను కూడా పరిచయం చేయాలని మరికొందరు సూచించారు.
Apple store
Tim cook
Madhuri Dixit

More Telugu News