Chandrababu: బీటెక్ రవికి భద్రత తొలగించడంపై చంద్రబాబు అభ్యంతరం

Chandrababu wrote DGP after police withdraws BTech Ravi security
  • గత నెల 29తో ముగిసిన బీటెక్ రవి పదవీకాలం
  • గన్ మన్లను ఉపసంహరించిన పోలీసులు
  • డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు
  • బీటెక్ రవికి ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు ఉన్నాయని వెల్లడి
టీడీపీ నేత బీటెక్ రవికి గన్ మన్లను తొలగించడం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. బీటెక్ రవికి భద్రత ఉపసంహరించడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీటెక్ రవికి భద్రత కొనసాగించాలంటూ డీజీపీకి లేఖ రాశారు. బీటెక్ రవికి ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు ఉన్నాయని వెల్లడించారు. 

గత నెల 29తో ఎమ్మెల్సీగా బీటెక్ రవి పదవీకాలం ముగిసింది. దాంతో పోలీసులు గన్ మన్లను వెనక్కి తీసుకున్నారు. టీడీపీ హయాంలో బీటెక్ రవికి 2 ప్లస్ 2 భద్రత ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక అది 1 ప్లస్ 1కు తగ్గించారు.
Chandrababu
BTech Ravi
Security
TDP
MLC

More Telugu News