Fastrack: ఫాస్ట్రాక్ నుంచి తక్కువ ధరకే స్మార్ట్ వాచ్

Fastrack Smart launches FS1 smartwatch buy exclusively on Amazon
  • లిమిట్ లెస్ సిరీస్ కింద విడుదలైన ఎఫ్ఎస్1
  • దీని ధర రూ.1,995
  • అమెజాన్ పోర్టల్ పై విక్రయాలు
  • ల్యాగ్ లేని అనుభవాన్ని ఇస్తుందంటున్న కంపెనీ
ఫాస్ట్రాక్ సంస్థ (టాటాలకు చెందిన టైటాన్ బ్రాండ్) లిమిట్ లెస్ సిరీస్ కింద తక్కువ ధరకే స్మార్ట్ వాచ్ విడుదల చేసింది. లిమిట్ లెస్ ఎఫ్ఎస్1 ప్రత్యేకంగా అమెజాన్ ప్లాట్ ఫామ్ పై విక్రయానికి రానుంది. దీని డిస్ ప్లే సైజు 1.95 అంగుళాలు. హారిజాంటల్ కర్వ్ డ్ డిస్ ప్లే తో వస్తుంది. ఇందులో ఏటీఎస్ చిప్ సెట్ ఉపయోగించారు. ఎటువంటి ల్యాగ్ లేకుండా స్మూత్ టచ్ అనుభవాన్ని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. 

డిస్ ప్లే 240/296 పిక్సల్ రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, సింగిల్ సింక్ బ్లూటూత్ కాలింగ్ (బీటీ 5.3) సదుపాయాలు ఉన్నాయి. కాల్స్ ను స్మార్ట్ వాచ్ నుంచే రిసీవ్ చేసుకోవడంతోపాటు, కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ లు కూడా చూసుకోవచ్చు. 10 రోజుల బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఐపీ 68 డస్ట్, వార్ రెసిస్టెన్స్ రేటింగ్ తో వస్తుంది. బ్లాక్, బ్లూ, పింక్ రంగుల్లో లభిస్తుంది. 

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోచ్ ఫీచర్ ఇందులో ఉంటుంది. శారీరక వ్యాయామాలు, ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఆక్సిజన్ శాచురేషన్ చూసుకోవచ్చు. నిద్ర తీరును కూడా ట్రాక్ చేస్తుంది. దీని ధర రూ.1995.
Fastrack
Smart watch
launches
FS1 smartwatch
Amazon

More Telugu News