Alla Ramakrishna Reddy: వైసీపీకి దూరమయ్యారనే వార్తలపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందన

Iam in YSRCP says Alla Ramakrishna Reddy
  • ఈ వార్తల్లో నిజం లేదన్న ఆర్కే
  • నియోజకవర్గ అభివృద్ధి పైనే దృష్టి సారించానన్న ఎమ్మెల్యే
  • టికెట్ ఎవరికి ఇవ్వాలనేది జగన్ నిర్ణయమని వ్యాఖ్య
వైసీపీకి ఆ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) దూరంగా ఉంటున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆర్కే స్పందిస్తూ ఈ ప్రచారంలో నిజం లేదని చెప్పారు. నియోజకవర్గంలో వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థ పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయని.. దీంతో తాను అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించానని తెలిపారు. 

ముఖ్యమంత్రి జగన్ సంక్షేమం, సీఎం అండతో తాను చేస్తున్న అభివృద్ధి రెండూ కలిసి నియోజకవర్గాన్ని పురోగతి వైపు తీసుకెళ్తున్నాయని చెప్పారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేశ్ ను ప్రజలు ఓడించారని, ఈసారి కూడా వైసీపీదే గెలుపని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనేది జగన్ నిర్ణయమని, ఆయన తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఇప్పటికే చెప్పానని అన్నారు.
Alla Ramakrishna Reddy
YSRCP
Jagan

More Telugu News