Jawahar: 6 గంటల సేపు జగన్ విజయ్ స్వామితో ఆశీర్వాదం తీసుకున్నారంటే నమ్మాలా: జవహర్
- సీఎం జగన్‌పై మాజీ మంత్రి జవహర్ విమర్శలు
- రాజకీయాలకు స్వాములను వాడుకుంటున్నారని వ్యాఖ్య
- జగన్ 6 గంటల పాటు విజయ్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారంటే ప్రజలు నమ్మాలా అని ప్రశ్న
- వివేకానంద హత్య కేసుపై చర్చించేందుకే విజయ్ స్వామితో భేటీ అని ఆరోపణ
ప్రస్తుతం ఏపీలో విజయ్ కుమార్ స్వామి కేంద్రంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరుగుతోంది. సీఎం జగన్ శ్రీవారి దర్శనం కంటే లాబీయిస్టుల దర్శనానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని టీడీపీ మాజీ మంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గంటల సేపు విజయ్ కుమార్ స్వామితో ఆశీర్వాదం తీసుకున్నారంటే ప్రజలు నమ్మాలా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ లబ్ధికోసమే స్వాములు, పూజారులను వాడుకుంటున్నారని, ఇది హిందువులను అవమానించడమేనని మండిపడ్డారు. వివేకానంద రెడ్డి హత్య కేసుపై చర్చించడానికే విజయ్ కుమార్ స్వామి సీఎంను కలిశారని ఆరోపించారు.