Indias Happiest: మన దేశంలో సంతోషకరమైన రాష్ట్రం ఏది?

This State Is Indias Happiest Claims A Study

  • మిజోరంలో ఎక్కువ మంది హ్యాపీ
  • అక్కడి సామాజిక నిర్మాణమే కారణం
  • చదువుల విషయంలో పిల్లలపై ఒత్తిడి ఉండదు

మన దేశంలో సంతోషంగా ఉండే ప్రాంతం ఒకటి ఉందా? కచ్చితంగా ఇది ఆసక్తికరమైన విషయమే. గురుగ్రామ్ కు చెందిన మేనేజ్మెంట్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ రాజేష్ కే పిలానియా ఇదే విషయమై ఓ అధ్యయనం నిర్వహించారు. దేశంలో సంతోషకరమైన రాష్ట్రం మిజోరాం అని ఈ అధ్యయనంలో వెల్లడైనట్టు ఆయన ప్రకటించారు.  

దేశంలో మిజోరం నూరు శాతం అక్షరాస్యత సాధించిన రెండో రాష్ట్రం. విద్యార్థులకు అవకాశాలకు కొదవ ఉండదు. ఆరు అంశాల ఆధారంగా మిజోరాం రాష్ట్రానికి సంతోషకమైన ట్యాగ్ లైన్ ఇచ్చినట్టు రాజేష్ కే పిలానియా తెలిపారు. కుటుంబ సంబంధాలు, పని ప్రదేశంలో పరిస్థితులు, సామాజిక అంశాలు, దాతృత్వం, మతం, సంతోషం, భౌతిక, మానసిక ఆరోగ్య అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

ఐజ్వాల్ లోని ప్రభుత్వ మిజో హైస్కూల్ విద్యార్థి తన చిన్నప్పుడే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లినప్పటికీ చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యాడు. సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరవ్వాలని అనుకుంటున్నాడు. అదే స్కూల్ కు చెందిన మరో పదో తరగతి విద్యార్థి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలని కలలు కంటున్నాడు. అక్కడి టీచర్లు తరచుగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తారు. 

మిజోరంలో ఉన్న సామాజిక నమూనా అక్కడ సంతోషానికి కారణమన్నది వాదన. తమది కుల రహిత సమాజమని, పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రుల వైపు ఒత్తిడి ఉండదని ఓ టీచర్ చెప్పారు. బాలికలు, బాలుర పట్ల అక్కడ వివక్ష ఉండదు. అందరినీ సమానంగా చూస్తారు.

  • Loading...

More Telugu News