Raj Kumar: మెగాస్టార్ వాడిన కారులోనే హీరోగా ప్రయత్నాలు మొదలెట్టాను: రాజ్ కుమార్

Raj Kumar Interview
  • చిరూ పోలికలతో కనిపించే రాజ్ కుమార్
  • కాలేజ్ రోజుల్లోనే సినిమా పిచ్చి ఉండేదని వ్యాఖ్య 
  • ముందుగా ఆదరించింది దాసరి గారని వెల్లడి 
  • అల్లు అరవింద్ గారి బ్యానర్లో ఫస్టు మూవీ చేశానని వివరణ
రాజ్ కుమార్ .. చూడగానే చిరంజీవి పోలికలతో ఆకట్టుకునే నటుడు. అప్పట్లో హీరోగా కొన్ని సినిమాల్లో నటించిన ఆయన, ఆ తరువాత టీవీ సీరియల్స్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. 'విధి' .. 'పవిత్ర బంధం' సీరియల్స్ ఆయనకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"నేను కాలేజ్ రోజుల్లోనే చాలా స్టైల్ ను మెయింటేన్ చేసేవాడిని. మా ఫ్రెండ్స్ అంతా కూడా సినిమాల్లో ట్రై చేయమని ప్రోత్సహించేవారు. నన్ను సినిమాల్లోకి పంపించమని మా నాన్నతో ఆయన ఫ్రెండ్స్ అనడం మొదలుపెట్టారు. దాంతో మా నాన్న నన్ను చెన్నై పంపించడానికి ఒప్పుకున్నారు. అప్పుడు ఉద్యోగ రీత్యా మా నాన్నగారు 'నెల్లూరు'లో ఉన్నారు. ఆ పక్క వీధిలోనే చిరంజీవిగారి ఇల్లు ఉండేది" అని అన్నారు. 

"చెన్నై లో ఒక ఇల్లు .. ఒక కారు నాకు ఏర్పాటు చేయాలని మా నాన్నగారు నిర్ణయించుకున్నారు. ఇల్లు ఏర్పాటు చేశారు. చిరంజీవిగారు తన పాతకారును అమ్ముతున్నారని తెలిసి, నాన్నగారు ఆ కారును కొని నాకు ఇచ్చారు. చెన్నైలో ఉంటూ సినిమాల్లో ట్రై చేస్తున్న నన్ను ముందుగా ఆదరించింది దాసరిగారు. ఫస్టు సినిమా చేసింది మాత్రం అల్లు అరవింద్ గారి బ్యానర్లో" అంటూ చెప్పుకొచ్చారు. 

Raj Kumar
Dasari
Allu Arvind

More Telugu News