Congress: నల్గొండలో కాంగ్రెస్ తలపెట్టిన నిరుద్యోగ దీక్ష రద్దు

TPCC cancels protest event in nalgonda after Uttamkumar reddy raises objection
  • ఈ నెల 21న జరగాల్సిన నిరుద్యోగ సభను రద్దు చేసినట్టు టీపీసీసీ ప్రకటన
  • తనకు చెప్పకుండానే సభ ఏర్పాటు చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం
  • కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌కు ఫిర్యాదు
  • చివరకు సభను రద్దు చేసిన టీపీసీసీ
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన నిరుద్యోగ నిరసన.. కాంగ్రెస్ నేతల మధ్య వివాదాన్ని రాజేసింది. ఈ నెల 21న ఎంజీ యూనివర్సిటీలో నిరసన సభ తలపెడుతున్నట్టుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. ఈ ప్రకటనపై సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండానే సభ ఏర్పాటు చేశారని ఆరోపించారు. 

ఈ విషయమై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ థాక్రేకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో, టీపీసీసీ నిరసన సభను రద్దు చేసింది. వివాదం ముదిరే అవకాశం ఉందనో లేక అధిష్ఠానం ఆదేశించిందో గానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Congress
TPCC President
Revanth Reddy
Uttam Kumar Reddy

More Telugu News