Aaradhya Bachchan: ట్రోలింగ్ పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన 11 ఏళ్ల అమితాబ్ మనమరాలు ఆరాధ్య

Amitabh Bachchans granddaughter Aaradhya moves Delhi HC against YT tabloid for reporting fake news on her health

  • యూట్యూబ్ టాబ్లాయిడ్‌పై అభిషేక్, ఐశ్వర్య కూతురు ఆరాధ్య పిటిషన్
  • తనపై అవాస్తవాలు వ్యాప్తి చేస్తున్న టాబ్లాయిడ్‌ను నిలువరించాలంటూ అభ్యర్ధన
  • ఈ కేసుపై నేడు కోర్టులో విచారణ

బిగ్‌బీ అమితాబ్ మనవరాలు, ఐశ్వర్య-అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్య బచ్చన్  ఓ యూట్యూబ్‌ టాబ్లాయిడ్‌పై ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. తనపై అసత్య వార్తలు వ్యాప్తి చేస్తున్న ఆ టాబ్లాయిడ్‌ను నిలువరించాలంటూ కోర్టును వేడుకుంది. ఈ కేసులో కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. 

తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై ఆ యూట్యూబ్ టాబ్లాయిడ్ తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని ఆరాధ్య తన పిటిషన్‌లో ఆరోపించింది. తాను మైనర్ కాబట్టి ఇలాంటి వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని కోర్టును అభ్యర్థించింది. 

కూతురిపై ట్రోలింగ్‌.. అభిషేక్ బచ్చన్ గుస్సా
గతంలోనూ ఆరాధ్య బచ్చన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైంది. తన వ్యక్తిగత జీవితమే లక్ష్యంగా ఆమెపై ట్రోల్స్ అవాకులు చవాకులు రాసుకొచ్చారు. ఈ తీరుపై అభిషేక్ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ట్రోలింగ్ అస్సలు ఆమోదయోగ్యం కాదు. ఎవరూ దాన్ని సహించకూడదు. అయితే.. ఓ పబ్లిక్ ఫిగర్‌గా ట్రోలింగ్ ఎందుకు జరుగుతోందో నేను అర్థం చేసుకోగలను. కానీ.. నా కూతురిపై ట్రోలింగ్ ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఏదైనా అనాలనుకుంటే నన్నే డైరెక్ట్‌గా అనండి’’ అంటూ అప్పట్లో అభిషేక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News