Ankit Bagai: అమెరికాలో ఆచూకీ లేకుండా పోయిన భారత సంతతి ఇంజినీర్ మృతి
- ఏప్రిల్ 9 నుంచి జాడ తెలియని అంకిత్ బగాయ్
- ఓ హెల్త్ క్లినిక్ నుంచి బయల్దేరిన ఐటీ నిపుణుడు
- ఎంతకీ రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు
- మేరిల్యాండ్ లోని చర్చిల్ సరస్సులో మృతదేహం లభ్యం
అంకిత్ బగాయ్ అనే ఇండో-అమెరికన్ ఐటీ నిపుణుడు ఇటీవల అమెరికాలో ఆచూకీ లేకుండా పోయాడు. 30 ఏళ్ల అంకిత్ బగాయ్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అతడి మృతదేహాన్ని మేరీల్యాండ్ రాష్ట్రంలోని చర్చిల్ సరస్సులో కనుగొన్నారు. అంకిత్ బగాయ్ చివరిసారిగా ఈ నెల 9న కనిపించాడు. మైల్ స్టోన్ ప్లాజా వద్ద ఉన్న ఓ హెల్త్ క్లినిక్ నుంచి బయల్దేరిన అతడు మళ్లీ తిరిగి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేసినా అతడి ఆచూకీ తెలియరాలేదు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, చర్చిల్ సరస్సులో దొరికిన మృతదేహం అంకిత్ బగాయ్ దేనని గుర్తించారు. అతడి మృతికి గల కారణాలు ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.