CUET: పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 5 నుంచి సీయూఈటీ పరీక్షలు

CUET will be commenced from June 5

  • వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్
  • సీయూఈటీని నిర్వహిస్తున్న ఎన్టీఏ
  • దరఖాస్తుల గడువు మే 5 వరకు పొడిగింపు
  • తాజా సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ చూస్తుండాలన్న ఎన్టీఏ

దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీయూఈటీ పరీక్షలు జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఓ ప్రకటనలో వెల్లడించింది. పీజీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు మే 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. 

వాస్తవానికి దరఖాస్తుల గడువు ఏప్రిల్ 19తోనే ముగిసింది. తాజాగా, ఈ గడువును మరింత పొడిగించారు. కాగా, సీయూఈటీ పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం కోసం నిత్యం ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ ను సందర్శిస్తుండాలని విద్యార్థులకు ఎన్టీఏ సూచించింది.

  • Loading...

More Telugu News