Nara Lokesh: 1000 కిమీ మైలురాయి చేరుకున్న నారా లోకేశ్ పాదయాత్ర

Nara Lokesh Padayatra reaches 1000 km milestone

  • కొనసాగుతున్న లోకేశ్ యువగళం
  • తన వెన్నంటి నిలిచిన వివిధ కమిటీలు, వాలంటీర్లకు లోకేశ్ అభినందనలు
  • ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపు 

యువగళం పాదయాత్ర 1000 కి.మీ మైలురాయి చేరుకున్న సందర్భంగా ఇప్పటివరకు తనకు వెన్నంటి నిలచిన యువగళం సైనికులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. 

అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనవరి 27న పాదయాత్ర ప్రారంభం నుంచి వివిధ కమిటీలు క్రమశిక్షణతో యాత్ర సజావుగా సాగేలా అహర్నిశలు పనిచేస్తున్నాయని కొనియాడారు. రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా తాను చేస్తున్న చారిత్రాత్మక యువగళం పాదయాత్రలో అమోఘమైన రీతిలో సేవలందిస్తున్నారంటూ వివిధ కమిటీల సభ్యులు, వాలంటీర్లను లోకేశ్ పేరుపేరునా అభినందించారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. 

లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను ముందుకు నడిపించడంలో 13 కమిటీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. యువగళం ప్రధాన సమన్వయకర్త కిలారు రాజేశ్ నేతృత్వంలో ఈ కమిటీలు అనుక్షణం లోకేశ్ ను వెన్నంటి ఉండి యాత్ర సజావుగా సాగేందుకు సహకారం అందిస్తున్నాయి. వీరితోపాటు 100 మంది పసుపు సైనికులు వాలంటీర్లుగా వ్యవహరిస్తూ లోకేశ్ ను రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

యువగళం పాదయాత్రలో కీలక వ్యక్తులు వీళ్లే...

1. యువగళం పాదయాత్ర మెయిన్ కోఆర్డినేటర్ - కిలారు రాజేశ్.
2. యువగళం అధికార ప్రతినిధులు - ఎం ఎస్ రాజు, దీపక్ రెడ్డి.
3. మీడియా కమిటీ - మెయిన్ కోఆర్డినేటర్ బి.వి. వెంకట రాముడు, సభ్యుడు జస్వంత్.
4. భోజన వసతుల కమిటీ - మద్దిపట్ల సూర్యప్రకాశ్, సభ్యుడు లక్ష్మీపతి.
5. వాలంటీర్ కోఆర్డినేషన్ కమిటీ - రవి నాయుడు, ప్రణవ్ గోపాల్.
6. రూట్ కోఆర్డినేషన్ కమిటీ - రవి యాదవ్.
7. అడ్వాన్స్ టీమ్ కమిటీ - డూండీ రాకేష్, నిమ్మగడ్డ చైతన్య, శ్రీరంగం నవీన్ కుమార్, ప్రత్తిపాటి శ్రీనివాస్.
8. వసతి ఏర్పాట్ల కమిటీ - జంగాల వెంకటేష్, నారా ప్రశాంత్, లీలా కృష్ణ, శ్రీధర్, ఐనంపూడి.రమేష్.
9. యువగళం పిఆర్ టీమ్ - కృష్ణారావు, మునీంద్ర, కిశోర్.
10. యువగళం సోషల్ మీడియా కోఆర్డినేషన్ - కౌశిక్, అర్జున్.
11. అలంకరణ కమిటీ - మలిశెట్టి వెంకటేశ్వర్లు, బ్రహ్మం.
12. రూట్ వెరిఫికేషన్ కమిటీ - అమర్నాథ్ రెడ్డి, కస్తూరి కోటేశ్వరరావు.
13. తాగునీటి సదుపాయం – భాస్కర్, వెంకట్
14. సెల్ఫీ కోఆర్డినేషన్ – సూర్య

  • Loading...

More Telugu News