SRH: చెపాక్ లో సన్ రైజర్స్ కు మొదట బ్యాటింగ్... ఏం చేస్తారో!

SRH loses toss and put into bat first by CSK
  • చెపాక్ లో సన్ రైజర్స్ × చెన్నై సూపర్ కింగ్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోనీ
  • సొంతగడ్డపై బెబ్బులిలా ఆడే సూపర్ కింగ్స్
  • సన్ రైజర్స్ సత్తాకు నేడు అగ్ని పరీక్ష
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ అగ్రగామి జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ తో నేడు తలపడుతోంది. ఈ మ్యాచ్ కు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేయునంది. 

కాగితంపై చూస్తే బలంగానే కనిపిస్తున్న సన్ రైజర్స్... మైదానంలో సమష్టిగా ఆడడంలో విఫలమవుతోంది. మొన్న ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో లక్ష్యఛేదనలో నిరాశ కలిగించింది. ఇవాళ చెన్నై జట్టుపై మొదట బ్యాటింగ్ చేస్తోంది కాబట్టి... భారీ స్కోరు సాధించకపోతే మాత్రం చాలా కష్టం. 

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ మామూలుగానే బలమైన జట్టు. ఇక సొంతగడ్డపై చెప్పేదేముంది... అత్యంత ప్రమాదకరమైన జట్టు అంటే ఇదే అనిపిస్తుంది. ఓవైపు ధోనీ వ్యూహ చతురత, మరోవైపు ఎల్లో ఆర్మీ కోలాహలం... ఇలాంటి పరిస్థితుల్లో చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించాలంటే ఏ జట్టుకైనా శక్తికి మించిన పనే! 

మరి ఇవాళ విజయం సాధించాలంటే సన్ రైజర్ ఇవాళ సర్వశక్తులు ఒడ్డి ఆడాల్సిందే.
SRH
CSK
Toss
Batting
Chepak
Chennai

More Telugu News