Vishnu Kumar Raju: అవినాశ్ రెడ్డి జైలుకు వెళ్తే వైసీపీని మూసుకోవాల్సిందే: విష్ణుకుమార్ రాజు

If Avinash Reddy goes to jail YSRCP will have to be closed says Vishnu Kumar Raju
  • చంద్రబాబు వాహనంపై రాళ్లదాడిని ఖండించిన విష్ణురాజు
  • ఆదిమూలపు సురేశ్ బట్టలు విప్పుకుని సవాల్ విసరడం సిగ్గుచేటని విమర్శ
  • వివేకా హత్య కేసులో అసలైన సూత్రధారులు ఇంకా బయటకు రాలేదని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ పై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేయడాన్ని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తప్పుపట్టారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మంత్రిగా ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఆదిమూలపు సురేశ్ బట్టలు విప్పుకుని సవాల్ విసరడం సిగ్గు చేటని అన్నారు. మీరు బట్టలు విప్పుకోవాల్సిన అవసరం లేదని... 2024 ఎన్నికల్లో ప్రజలే మీ బట్టలు విప్పుతారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ మెప్పు పొందడానికే వైసీపీ మంత్రులు ఇలా నీచంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయమని చెప్పారు. వివేకా హత్య కేసులో అసలైన సూత్రధారులు ఇంకా బయటకు రాలేదని, వాళ్లు కలుగులో దాక్కున్నారని అన్నారు. అవినాశ్ రెడ్డి జైలుకు వెళ్తే వైసీపీని మూసుకోవాల్సిందేనని జోస్యం చెప్పారు.
Vishnu Kumar Raju
BJP
Avinash Reddy
Adimulapu Suresh
YSRCP

More Telugu News