Maharashtra: మహారాష్ట్రలో నిన్నటితో పోలిస్తే మరింత తగ్గిన కరోనా కేసులు

Maharashtra sees drop in Covid cases with 850 new infections

  • కరోనా కేసులపై డేటా విడుదల చేసిన ఆరోగ్య శాఖ
  • మహారాష్ట్రలో క్రియాశీలక కేసులు 6167, మరణాల రేటు 1.18 శాతం
  • ఇప్పటికీ ప్రబలమైన కోవిడ్ వేరియంట్‌గా ఒమిక్రాన్ XBB.1.16

మహారాష్ట్రలో శనివారం నాడు కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 850 కొత్త ఇన్‌ఫెక్షన్లు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం... క్రియాశీల కేసులు 6,167గా ఉన్నాయి. మరణాల రేటు 1.18%గా ఉంది. బులెటిన్ ప్రకారం.. 648 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 98.10%గా ఉంది. ఒమిక్రాన్ XBB.1.16 ఇప్పటికీ ప్రబలమైన కోవిడ్ వేరియంట్‌గా ఉంది. ఎక్కువ కేసులు ఇవేనని గుర్తించారు. 1377 ఇన్‌ఫెక్షన్‌లతో అత్యధిక యాక్టివ్ కేసులతో ముంబయి అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత థానే, పాల్ఘర్ నిలిచాయి.

రాష్ట్రంలో శుక్రవారం మొత్తం 993 కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఐదు మరణాలు నమోదయ్యాయి. ముంబైలో ఇద్దరు రోగులు కరోనా బారిన పడి మరణించారు. మృతుల్లో ఒకరు క్యాన్సర్‌తో బాధపడుతున్న 56 ఏళ్ల మహిళ కాగా, మరొకరు 44 ఏళ్ల మహిళ. ఆమెకు క్షయ కూడా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. దేశంలో శనివారం 12,193 తాజా కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, సంక్రమణ యొక్క క్రియాశీల కేసుల సంఖ్య 67,556 కి పెరిగింది.

  • Loading...

More Telugu News