kl rahul: ఇండియన్ క్రికెట్లో ఫస్ట్ టైమ్... కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన కేఎల్ రాహుల్

KL Rahul Beats Virat Kohli Rohit Sharma to reach 7000 T20 runs

  • భారత టీ20 క్రికెట్లో ఒకే ఒక్కడు 
  • ఇటీవల పంజాబ్ పై, నేడు గుజరాత్ టైటాన్స్ పై అదరగొట్టిన కేఎల్ రాహుల్
  • 200 కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో 7 వేల పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్ గా రికార్డ
  • కోహ్లీ, రోహిత్, శిఖర్ ధావన్ కంటే తక్కువ ఇన్నింగ్స్ లలో 7 వేల పరుగులు

అంతర్జాతీయ మ్యాచ్ లలో అంతగా ఫామ్ లో లేకపోయినప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ స్కిప్పర్ కేఎల్ రాహుల్ పైన ఐపీఎల్ లో కాస్త అంచనాలు ఉన్నాయి. ఇటీవల పంజాబ్ కింగ్స్ పైన అతను 74 పరుగులతో అదరగొట్టాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో ఈ రోజు జరిగిన మ్యాచ్ లోను 61 బంతుల్లో 68 పరుగులతో సత్తా చాటాడు. అయినప్పటికీ లక్నో ఓడిపోయింది. అయితే కేఎల్ రాహుల్ వ్యక్తిగతంగా ఓ మైల్ స్టోన్ అందుకున్నాడు. మహమ్మద్ షమీ విసిరిన చివరి బంతికి ఫోర్ కొట్టిన కేఎల్ రాహుల్ టీ-20ల్లో 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

200 కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 7000కు పైగా టీ20 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌ రాహుల్‌. ఈ మార్కును చేరుకోవడానికి రాహుల్ 197 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 212 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లి... రాహుల్‌ తర్వాత వేగవంతమైన భారత క్రికెటర్ గా నిలిచాడు. శిఖర్ ధావన్ 246 ఇన్నింగ్స్‌లలో 7000 టీ20 పరుగులు చేసిన మూడో భారత ఆటగాడు. రోహిత్ శర్మ 258 ఇన్నింగ్స్‌ల్లో టీ20ల్లో 7000 పరుగులు దాటాడు.

  • Loading...

More Telugu News