TTD: తిరుమల శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న కేటుగాళ్లు

Police files case against fake ttd website

  • టీటీడీకి నకిలీ వెబ్‌సైట్ల బెడద
  • చిన్న మార్పులతో ఫేక్ వెబ్‌సైట్లు సృష్టిస్తున్న నిందితులు
  • నకిలీలతో అధికంగా మోసపోతున్న ఉత్తరాది వారు
  • తాజాగా మరో నకిలీ టీటీడీ వెబ్‌సైట్‌పై పోలీసుల ఎఫ్‌ఐఆర్

టీటీడీకి నకిలీ వెబ్‌సైట్ల బెడద వదలట్లేదు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేరిట శ్రీవారి భక్తులకు టోకరా ఇస్తున్న ఓ నకిలీ వెబ్‌సైట్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. శ్రీవారి దర్శన, ఆర్జిత సేవల పేరిట ఈ వెబ్‌సైట్ అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటోంది. 

ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శన, ఆర్జిత సేవలకు సంబంధించి దాదాపు అన్ని టిక్కెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తోంది. ఇదే అదనుగా కేటుగాళ్లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలిఉన్న నకిలీ సైట్లను రూపొందించి శ్రీవారి భక్తుల సొమ్మును కాజేస్తున్నారు. ఉత్తరాది వారు ఈ మోసాల బారిన అధికంగా పడుతున్నారు. ఈ సమస్య తీవ్రం కావడంతో టీటీడీ గతంలో ఓమారు తన వెబ్‌సైట్ పేరు కూడా మార్చింది. అన్ని రాష్ట్రాల వారూ సులభంగా గుర్తించగలిగేలా మార్పులు చేర్పులు చేసింది. అయినా, కేటుగాళ్లు చిన్న చిన్న మార్పులతో ఒరిజినల్‌‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్లు సృష్టిస్తూ డబ్బులు దండుకుంటున్నారు.

TTD
  • Loading...

More Telugu News