Balineni Srinivasa Reddy: ఆరోపణలను రుజువు చేస్తే నా ఆస్తి మొత్తం రాసిస్తా: బాలినేని

balineni clarifies on investments in movie production
  • సినీ రంగంలో తనకు పెట్టుబడులు ఉన్నాయన్న ఆరోపణలను ఖండించిన బాలినేని
  • నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్
  • తమపై దుష్ప్రచారాలు మానుకోవాలంటూ హితవు
సినీ రంగంలో తనకు పెట్టుబడులు ఉన్నాయంటూ చేస్తున్న ఆరోపణలను వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. తనతోపాటు తన వియ్యంకుడు భాస్కరరెడ్డికి రూపాయి కూడా ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని స్పష్టం చేశారు. 

ఆరోపణలను రుజువు చేస్తే తన ఆస్తి మొత్తం రాసిస్తానని బాలినేని ప్రకటించారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని సవాల్ చేశారు. తమపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. తనకు సినీ రంగంలో పెట్టుబడులు ఉన్నాయో లేదో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరా తీసుకోవచ్చన్నారు. 

ప్రముఖ నిర్మాణ సంస్థలో బాలినేనికి పెట్టుబడులు ఉన్నాయంటూ విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇటీవల ఐటీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రముఖ సంస్థ అక్రమ లావాదేవీల విషయంలో మాజీ మంత్రి బాలినేని బినామీ, ఆయన వియ్యంకుడు భాస్కరరెడ్డి, వైసీపీ నేత, ఆడిటర్ గన్నమనేని వింకటేశ్వరరావులపై విచారణ జరిపించాలని కోరారు. సదరు నిర్మాణ సంస్థ అక్రమాస్తులు, లావాదేవీల వెనుక తెలంగాణకు చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయనకు సన్నిహితుడైన బాలినేని శ్రీనివాస రెడ్డి హస్తం ఉందని ఆరోపణలున్నాయని చెప్పారు. 
Balineni Srinivasa Reddy
Talasani
investments in movie production
YSRCP
Janasena

More Telugu News