Ravi Shastri: కోహ్లీ-గంగూలీ షేక్ హ్యాండ్ వివాదం... రవిశాస్త్రి ఏం చెప్పాడంటే?

Ravi Shastri on No Handshake Situation Between Two Persons

  • కోహ్లీ, గంగూలీ షేక్ హ్యాండ్ వివాదంపై రవిశాస్త్రి పరోక్ష స్పందన
  • ఇద్దరూ గొప్పవాళ్లే... కానీ ఒకరిపై మరొకరికి అయిష్టత అని వ్యాఖ్య
  • వారి గురించి తాను ఎలా మాట్లాడతానో చెప్పిన రవిశాస్త్రి

ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇటీవలి మ్యాచ్ అనంతరం సౌరవ్ గంగూలీకి విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు విముఖత చూపినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు కూడా ఇన్ స్టాలో ఒకరినొకరు అన్-ఫాలో చేసుకున్నారు. ఈ ఘటనపై దిగ్గజ మాజీ ఆటగాడు రవిశాస్త్రి స్పందించారు. అయితే ఆయన పరోక్షంగా స్పందించారు.

"ఇక్కడ ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు. ఒక ఆటగాడేమో భారత జట్టు గొప్ప ఆటగాడు, రెండో ప్లేయర్ కూడా మంచి ఆటగాడే. ఇప్పటికీ ఆడుతున్నాడు. వీరిద్దరు ఒకరి పైన మరొకరు అయిష్టతను కనబరుస్తున్నారు" అని వివరించారు.

మ్యాచ్ ముగిశాక ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడానికి వచ్చారని, కానీ వీరిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదని చెప్పారు. వీరికి తాను ఏమైనా సలహాలు ఇస్తానా అని అడుగుతుంటారని, అయితే తనకు ఉన్న రిలేషన్స్ ఆధారంగా మాట్లాడతానని, మాట్లాడవద్దనుకుంటే దాటవేస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News