Raghunandan Rao: మేం సిద్ధం... మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ కు రఘునందన్ రావు సై

Raghunandan Rao ready for Niranjan Reddy challenge
  • మంత్రి నిరంజన్ పైన రఘునందన్ రావు భూకబ్జా ఆరోపణలు
  • వచ్చి తన భూమిని చూడవచ్చునని మంత్రి సవాల్
  • మంత్రి ఆహ్వానం కోసం ఎదురు చూస్తానన్న రఘునందన్ 
తాను చేసిన భూకబ్జా ఆరోపణలపై మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన సవాల్ కు బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సై అన్నారు. ఆయన సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని, చర్చకు తాము ఎప్పుడూ సిద్ధమని, ఆయన తనను ఆహ్వానిస్తే నిరూపించేందుకు వెళతానని చెప్పారు. 

రఘునందన్ మంత్రి పైన భూకబ్జా ఆరోపణలు చేశారు. దీనిపై నేడు స్పందించిన నిరంజన్ రెడ్డి... తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని, అవసరమైతే వచ్చి చూసుకోవచ్చునని చెప్పారు. దీనిపై బీజేపీ నేత నేడు సాయంత్రం మీడియాతో మాట్లాడారు. 

"మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నేను కూడా చూశాను... పిలుస్తా అన్నాడు... 27వ తేదీ నాడో.. 28వ తేదీ నాడో... రఘునందన్ రావును కూడా రమ్మని చెబుతా అన్నాడు. మంత్రిగారి ఆహ్వానం కోసం నేను ఎదురు చూస్తాను. మంత్రిగారు పిలిస్తే తప్పకుండా వెళతాం. వారికి ఉన్న టైటిల్ ఎంత... వారి కాంపౌండ్ లో ఉన్నది ఎంత... కబ్జాలో ఎంత ఉన్నదో కచ్చితంగా లెక్క తేలుస్తాం... చర్చకు మేం ఎప్పుడూ భయపడం. తప్పకుండా చర్చకు సిద్ధంగా ఉన్నాం" అని రఘునందన్ రావు పేర్కొన్నారు. 
Raghunandan Rao
Minister
Telangana

More Telugu News