Undavalli Arun Kumar: జగన్ ప్రభుత్వాన్ని విమర్శించను.. ఎందుకని అడిగితే నా సమాధానం ఇదే: ఉండవల్లి
- జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత తనకు లేదన్న ఉండవల్లి
- ఏపీ పునర్విభజనపై జగన్ ప్రభుత్వం అఫిడవిట్ వేయడంతో తనకు బలమొచ్చిందన్న మాజీ ఎంపీ
- తనపై ఎంత దుష్ప్రచారం చేసినా జరగాల్సింది జరిగి తీరుతుందని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై కొన్నాళ్లపాటు తాను విమర్శలు చేయబోనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రామోజీరావు మార్గదర్శి అంశంపై నిన్న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ ప్రభుత్వంపై విమర్శలకు కొన్నాళ్లపాటు దూరంగా ఉంటానన్న ఉండవల్లి.. ఎందుకని తనను ప్రశ్నిస్తే తనకా అర్హత లేదని చెబుతానని అన్నారు. ఏపీ పునర్విభజన విషయంలో జగన్ ప్రభుత్వం అఫిడవిట్ వేయడం తనకు బలాన్ని ఇచ్చిందన్నారు. రామోజీరావుకు అనుకూలంగా టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు, జనసేన ప్రకటనలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్న ఆయన.. తనపై ఎంత దుష్ప్రచారం చేసినా జరగాల్సింది జరిగి తీరుతుందని తేల్చి చెప్పారు.