Virat Kohli: నిన్నటి ఐపీఎల్ మ్యాచులలో నమోదైన పలు రికార్డులు

Record Making Day for Virat Kohli CSK

  • అత్యధిక క్యాచ్‌లు పట్టిన మూడో క్రికెటర్‌గా కోహ్లీ రికార్డ్
  • శివమ్ దూబే థర్డ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
  • చెన్నై థర్డ్ హయ్యస్ట్ ఐపీఎల్ స్కోర్

నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు, కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించాయి. ఈ మ్యాచ్ ల తర్వాత విరాట్ కోహ్లీ, చెన్నై సూపర్ కింగ్స్ పేరిట పలు రికార్డులు నమోదయ్యాయి.

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్‌ల క్యాచ్ లను కూడా అందుకున్నాడు కోహ్లీ. తద్వారా కోహ్లీ 228 మ్యాచ్‌లలో 101 క్యాచ్‌లను అందుకొని, ఐపీఎల్ లో టాప్ 3గా నిలిచాడు. సురేష్ రైనా 204 మ్యాచ్ లలో 109 అత్యధిక క్యాచ్‌లతో మొదటి స్థానంలో,  కీరన్ పొలార్డ్ 189 మ్యాచ్‌ల్లో 103 క్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నారు.

థర్డ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

శివమ్ దూబే 20 బంతుల్లోనే ఫోర్లు, ఐదు సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ఐపిఎల్‌లో దూబే దూకుడు మీద ఉన్నాడు. ఆరు ఇన్నింగ్స్ లలో రెండు అర్ధ సెంచరీలతో 30.66 సగటుతో 184 పరుగులు చేశాడు. ఫాస్టెస్ట్ ఫిఫ్టీలో జాబితాలో దూబే చేరాడు. 2014లో పంజాబ్ కింగ్స్ పైన కేవలం 16 బంతుల్లోనే చెన్నై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు సురేష్ రైనా పేరిట నమోదయింది. ఆ తర్వాత 19 బంతులతో మొయిన్ అలీ, అజింక్యా రహానే సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు దూబే 20 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. దూబేతో పాటు ధోనీ, అంబటి రాయుడు కూడా 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన రికార్డు కలిగి ఉన్నారు.

చెన్నై థర్డ్ హయ్యస్ట్ ఐపీఎల్ స్కోర్


కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో చెన్నై 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. చెన్నైకి ఇది మూడో అత్యధిక ఐపీఎల్ స్కోర్. 2010లో రాజస్థాన్ రాయల్స్‌పై 246/5తో అత్యధిక రికార్డు స్కోరు నమోదు చేసింది. అంతకుముందు 2008లో మొహాలీలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 240/5 పరుగులు చేసింది. తాజా స్కోర్ చెన్నైకి మూడో అత్యధిక ఐపీఎల్ స్కోర్. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉంది.  2013లో పూణే వారియర్స్ పైన బెంగళూరు 263/5తో చెలరేగింది. అప్పుడు క్రిస్ గేల్ కేవలం 66 బంతుల్లో 175 నాటౌట్‌తో నిలిచాడు.

  • Loading...

More Telugu News