Fronx: భారత్ లో మారుతి కొత్త కారు 'ఫ్రాంక్స్'... నేడే విడుదల
- కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్లో సరికొత్త కారు
- చాలాకాలంగా ఎదురుచూస్తున్న కస్టమర్లు
- పలు వేరియంట్లలో ఫ్రాంక్స్
- ఆన్ లైన్ లేదా నెక్జా డీలర్ షిప్ లలో బుక్ చేసుకునే సదుపాయం
- రూ.7.46 లక్షల నుంచి ధరల శ్రేణి ప్రారంభం
కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తన కొత్త కారు ఫ్రాంక్స్ ను నేడు భారత మార్కెట్లో విడుదల చేసింది. భారతీయ కస్టమర్లు చాలాకాలంగా ఈ కారు కోసం ఎదురుచూస్తున్నారు.
ఫ్రాంక్స్ ప్రారంభ ధర రూ.7.46 లక్షలు. ఇది ఎక్స్ షోరూం ధర. ధర కాస్త అందుబాటులో ఉండడం కూడా దీనిపై భారీ ఆసక్తి నెలకొనేందుకు కారణమైంది.
ఇందులో 1.0 లీటర్ కే సిరీస్ టర్బో బూస్టర్ జెట్ ఇంజిన్ తో మరో వెర్షన్ కూడా ఉంది. దీని ప్రారంభ ధర రూ.9.72 లక్షల నుంచి రూ.13.13 లక్షల (ఎక్స్ షోరూం) వరకు ఉంది.
మారుతి ఫ్రాంక్స్ కారును కస్టమర్లు ఆన్ లైన్ ద్వారా కానీ, లేక, దేశవ్యాప్తంగా ఉన్న నెక్జా డీలర్ షిప్ ల వద్ద కానీ బుక్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ గా రూ.11 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్లో ఫ్రాంక్స్... టాటా పంచ్, సిట్రోయెన్ సీ3, రెనో కైగర్, నిస్సాన్ మాగ్నైట్ లకు గట్టి పోటీ ఇస్తుందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.