Saree: ఒకే చీర కోసం షాపింగ్ మాల్‌లో ఇద్దరు మహిళల మధ్య పోట్లాట.. వీడియో ఇదిగో!

 two customers fighting over for a saree in Mysore silk saree centre Bengaluru
  • బెంగళూరులో ఘటన
  • డిస్కౌంట్ సేల్ ప్రకటించిన మైసూర్ సిల్క్ శారీ సెంటర్
  • మహిళలతో నిండిపోయిన షాపింగ్ మాల్
  • ఒకే చీరపై ఇద్దరి మహిళల కన్ను
చీరలంటే ఆడాళ్లకు ఎంతిష్టమో! కట్టినా కట్టకున్నా వాటితో బీరువాలు నింపేస్తారు. ఇక, ఆఫర్లు, డిస్కౌంట్ సేల్స్ అంటూ షాపింగ్ మాల్స్ ప్రకటిస్తే వెంటనే వాలిపోతారు. చవగ్గా వచ్చేస్తున్నాయనుకుని గంటలపాటు కష్టపడి నచ్చిన చీరలు ఎంచుకుంటారు. బెంగళూరు మల్లేశ్వరం ప్రాంతంలోని మైసూర్ సిల్క్ శారీ సెంటర్ కూడా ఇలానే డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. 

విషయం తెలిసిన మహిళలు పొలోమంటూ షాపింగ్ మాల్‌కు పోటెత్తారు. జాతరకొచ్చినట్టు రావడంతో షాపింగ్ మాల్ నిండిపోయింది. నచ్చిన చీరలు ఎంచుకోవడంలో వారంతా మునిగిపోయారు. అక్కడి వరకు బాగానే ఉంది కానీ, అక్కడున్న చీరల్లో ఒక దానిపై ఇద్దరు మహిళల కన్ను పడింది. ఇద్దరూ దానిపై చెయ్యేశారు. అయితే, ముందు నేను చూశాను కాబట్టి నాక్కావాలని ఒకరంటే, లేదు అది నాక్కావాల్సిందేనంటూ మరో మహిళ వాగ్వివాదానికి దిగారు. 

అది కాస్తా ముదరి ఇద్దరూ పరస్పరం భౌతిక దాడికి దిగారు. జుట్లు పట్టుకుని ఒకరినొకరు కుమ్మేసుకున్నారు. షాపింగ్ మాల్ సిబ్బంది వారిని అతికష్టం మీద విడిపించారు. సందంట్లో సడేమియాలా చీరలు కొనేందుకు వచ్చిన వారిలో ఒకరు ఆ ఫైటింగును వీడియో తీసి ఎంచక్కా సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇంకేముంది.. వెంటనే వైరల్ అయిపోయింది. ఈ వీడియో చూసినవారు రకరకాల కామెంట్లతో ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూసేయండి మరి!
Saree
Mysore Silk Saree Centre
Bengaluru
Women Fight
Fight For Saree

More Telugu News