Shabbir Ali: అది అమిత్ షా తరం కాదు: షబ్బీర్ అలీ

It is not possible for Amit Shah to remove reservations for Muslims says Shabbir Ali
  • ముస్లింలకు రిజర్వేషన్లను తొలగించడం అమిత్ షా వల్ల కాదన్న షబ్బీర్ అలీ
  • ముస్లింలపై అమిత్ షా విషం చిమ్మారని మండిపాటు
  • అమిత్ షాపై రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్న అమిత్ షా... ముస్లిం రిజర్వేషన్లను తొలగించి వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీలకు ఇస్తామని అన్నారు. 

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మండిపడ్డారు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను తొలగించడం అమిత్ షా తరం కాదని చెప్పారు. అసలు తెలంగాణలో బీజేపీ వచ్చే అవకాశమే లేదని అన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడటం బీజేపీ నేతలకు అలవాటేననని విమర్శించారు. తెలంగాణ గడ్డపై అమిత్ షా మరోసారి ముస్లింలపై విషం చిమ్మారని మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామన్న అమిత్ షాపై రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ... అధికారంలో ఉన్నవాళ్లే మత రాజకీయాలు చేస్తే ఈ దేశాన్ని కాపాడేది ఎవరని ప్రశ్నించారు. దేశ హోంమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని అన్నారు.
Shabbir Ali
Mallu Bhatti Vikramarka
Congress
Amit Shah
BJP
Muslims
Reservations

More Telugu News