kochi: కొచ్చిలో నేడు వాటర్ మెట్రో ప్రారంభం
- వాటర్ మెట్రో సర్వీసులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కొచ్చి చుట్టుపక్కల పది దీవులను కలుపుతూ సర్వీసులు
- కేరళలో పర్యాటకానికి బూస్ట్ లా పనిచేస్తుందన్న సీఎం పినరయి విజయన్
దేశంలోనే తొలిసారిగా కేరళలోని కొచ్చిలో వాటర్ మెట్రో సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సర్వీసులను మంగళవారం ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. జర్మనీతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టామని, తొలిదశ పనులు పూర్తయ్యాయని, మంగళవారం నుంచి సర్వీసులను నడిపిస్తామని వివరించారు. కొచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లోని పది దీవులను కలుపుతూ 78 విద్యుత్ బోట్లను తిప్పుతామని విజయన్ వివరించారు. రాష్ట్ర పర్యాటక రంగంలో ఈ వాటర్ మెట్రో విప్లవాత్మక మార్పులకు కారణమవుతుందని, పర్యాటకానికి బూస్ట్ లా పనిచేస్తుందని పినరయి విజయన్ అభిప్రాయపడ్డారు.
వాటర్ మెట్రో విశేషాలలో కొన్ని..
- కొచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లోని పది దీవులను కలుపుతూ బోట్లు తిరుగుతుంటాయి.
- తొలిదశలో హైకోర్టు వైపిన్ టెర్మినల్స్ నుంచి వైట్టిలా కక్కనాడ్ టెర్మినల్స్ వరకు సర్వీసులు
- కొచ్చి 1 ఐడీ కార్డుతో ఈ వాటర్ మెట్రోలో ప్రయాణించేందుకు అవకాశం
- డిజిటల్ గానూ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించిన కొచ్చి వాటర్ మెట్రో
- టికెట్ ధర కనిష్ఠంగా రూ.20, గరిష్ఠంగా రూ.40 గా నిర్ణయం. వారం, నెల వారీగా పాసులు తీసుకునే వీలు
- ట్రాఫిక్ చిక్కులు లేకుండా వేగంగా ప్రయాణించేందుకు వాటర్ మెట్రో బెస్ట్ ఆప్షన్ అంటున్న ముఖ్యమంత్రి
- 10 దీవులు, 15 రూట్లు, 38 టెర్మినల్స్, 78 కిలోమీటర్ల మేర తిరగనున్న 78 ఎలక్ట్రిక్ బోట్లు