Aadhaar: పదేళ్లకోసారి ఆధార్ లో ఫొటో అప్ డేట్ చేసుకోవాల్సిందే.. ఇలా..!

Aadhaar photo needs to be updated every 10 years here is how to do it

  • యూఐడీఏఐ నిబంధనలు ఇవే చెబుతున్నాయి
  • తాజా ఫొటో, బయోమెట్రిక్ వివరాలతో అప్ డేట్ చేసుకోవాలి
  • 5 ఏళ్లు నిండిన చిన్నారులకూ అప్ డేట్ తప్పనిసరి

ఆధార్ ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్. గుర్తింపు, నివాస ధ్రువీకరణగా, అన్ని ముఖ్యమైన పనులకు అక్కరకొచ్చే ఆధార్ ను యాక్టివ్ గా ఉంచుకోవడం అవసరం. పదేళ్ల క్రితం ఆధార్ తీసుకుని, ఇంతవరకు అప్డేట్ చేసుకోని వారు, తప్పకుండా అప్డేట్ చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ (యూఐడీఏఐ) ఎన్నో సందర్భాల్లో ప్రకటనల ద్వారా సూచించింది. 

నిజానికి యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఆధార్ లో ఫొటో, బయోమెట్రిక్ వివరాలను పదేళ్లకోసారి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఐదేళ్లలోపు చిన్నారుల పేరిట ఆధార్ తీసుకుంటే తల్లి లేదా తండ్రి ఆధార్ బయోమెట్రిక్ తీసుకుంటారు. అటువంటప్పుడు పిల్లలకు ఐదేళ్లు నిండగానే, వారిని ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లాలి. అప్పుడు ఆధార్ కోసం చిన్నారి వేలి ముద్రలనే (బయోమెట్రిక్) తీసుకుంటారు. ఒకవేళ 5-15 ఏళ్ల మధ్య వయసులో పిల్లలకు ఆధార్ తీసుకున్న వారు.. పిల్లలకు 15 ఏళ్లు నిండిన వెంటనే మరోసారి ఆధార్ కేంద్రానికి వెళ్లి తాజా ఫొటో, బయోమెట్రిక్ వివరాలు ఇవ్వాలి. ఇక 15 ఏళ్లు నిండిన తర్వాత ఆధార్ తీసుకుని ఉంటే, ప్రతి పదేళ్లకోసారి వివరాలను అప్ డేట్ చేసుకోవాలి. 

అప్ డేట్ ఇలా..
యూఐడీఏఐ వెబ్ సైట్ నుంచి ఆధార్ ఎన్ రోల్ మెంట్/కరెక్షన్/అప్ డేట్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో వివరాలను నింపి, సమీపంలోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి. అక్కడ సిబ్బందికి దరఖాస్తు పత్రాన్ని ఇవ్వాలి. వారు వివరాలను వెరిఫై చేసి, తాజా ఫొటో, బయోమెట్రిక్ వివరాలు తీసుకుంటారు. ఇందుకోసం జీఎస్టీతో కలిపి రూ.100 చార్జీ కింద తీసుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్ నాలెడ్జ్ మెంట్ కాపీ ఇస్తారు. దీని ఆధారంగా పురోగతి గురించి చెక్ చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News